అభినందన్‌కు వీర్ చక్ర అవార్డు?

August 08, 2019


img

పుల్వామా ఉగ్రదాడి తదనంతర పరిణామాలలో పాకిస్థాన్‌ వాయుసేన భారత్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఆ దేశానికి చెందిన అత్యాధునిక ఎఫ్-16 యుద్దవిమానాన్ని తన మిగ్ విమానంతో వెంటాడి కూల్చివేసిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు భారత్ ప్రభుత్వం వీర్ చక్ర అవార్డుతో సత్కరించబోతున్నట్లు తాజా సమాచారం. అభినందన్ వర్ధమాన్‌ పాక్‌ విమానాన్ని వెంటాడుతూ పాక్‌ సరిహద్దులోకి ప్రవేశించినప్పుడు పాక్‌ వాయుసేన చేసిన ఎదురుదాడిలో మిగ్ విమానం కూలిపోయింది. అప్పుడు ఆయన పాక్‌ సైనికులకు బందీగా చిక్కారు. వారు ఆయనను చిత్రహింసలకు గురిచేసినప్పటికీ ఆయన వాయుసేన, సరిహద్దు సైనికదళాలకు సంబందించినా రహస్యాలను బయటపెట్టలేదు పైగా చాలా నిబ్బరంగా వ్యవహరించి యావత్ ప్రపంచ దేశాల ప్రశంశలు అందుకున్నారు. 

భారత్‌, అమెరికా, చైనా, అగ్రదేశాల ఒత్తిడితో పాకిస్థాన్‌ ప్రభుత్వం అభినందన్ వర్ధమాన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించక తప్పలేదు. అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానం ప్రపంచంలోనే అత్యాధునికమైన మరియు అత్యంత వేగవంతమైనదిగా గుర్తింపు కలిగినది. అటువంటి గొప్ప యుద్ధవిమానాన్ని అభినందన్ వర్ధమాన్‌ తన పాత మిగ్ విమానంతో కూల్చివేసినందుకు, పాక్‌ చేతిలో చిక్కినప్పటికీ అసమానధైర్య సాహసాలు ప్రదర్శించి భారత్‌ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసినందుకుగాను కేంద్రప్రభుత్వం అభినందన్ వర్ధమాన్‌కు వీర్ చక్ర అవార్డు ప్రధానం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 


Related Post