తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా విద్యుత్ బస్సులు జేరుతున్నాయి కానీ పెరుగుతున్న జనాభా, బస్సులకు అనుగుణంగా బస్ స్టేషన్లు, డిపోలు మాత్రం పెరగడం లేదు. ఈ సమస్యని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఆరు బస్ స్టేషన్లు, రెండు డిపోలు నిర్మించడానికి ఆమోదం తెలిపింది.
మధిర, మందని, ములుగు, కోదాడ, హుజూర్ నగర్, కాళేశ్వరంలో కొత్తగా అత్యాధునిక సదుపాయాలతో ఆరు బస్ స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించింది. టీఎస్ ఆర్టీసీకి చెందిన ఈ పనుల వివరాలు, పురోగతి...
• ఏటూరు నాగారం డిపో: రూ.5.91 కోట్లు వ్యయంతో 3.79 ఎకరాలలో బస్ డిపో నిర్మాణ పనులు పునాది స్థాయిలో ఉన్నాయి.
• పెద్దపల్లి డిపో: రూ.11.04 కోట్లు వ్యయంతో 4.78 ఎకరాలలో బస్ డిపో నిర్మాణ పనులు త్వరలో మొదలవుతాయి.
• మధిర బస్టాండ్: రూ.9.40 కోట్లు వ్యయంతో 2.2 ఎకరాలలో నిర్మాణ పనులు త్వరలో మొదలవుతాయి.
• మందని బస్టాండ్: రూ.89 వ్యయంతో నిర్మించేందుకు వర్క్ ఆర్డర్ జారీ అయ్యింది.
• కాళేశ్వరం బస్టాండ్: రూ.3.71 కోట్లు వ్యయంతో నిర్మించేందుకు వర్క్ ఆర్డర్ జారీ అయ్యింది.
• కోదాడ బస్టాండ్: రూ.16.89 కోట్లు వ్యయంతో 5.58 ఎకరాలలో నిర్మించబోతున్నారు. డిజైన్ ఇంకా ఖరారుచేయాల్సి ఉంది.
• హుజూర్ నగర్ బస్టాండ్: రూ.3.52 కోట్లు వ్యయంతో 4.12 ఎకరాలలో నిర్మించబోతున్నారు.
ఇవి కార్యక్రమంలో అశ్వారావు పేటలో శాటిలైట్ బస్ డిపో, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, భూపాలపల్లి జిల్లాలో కొత్తగా బస్టాండ్స్ నిర్మించబోతున్నారు.
నర్సంపేట, నెక్కొండ బస్టాండ్లలో కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించబోతున్నారు. వేములవాడ, గంగాధర, కధలాపూర్, గూడూరు, స్టేషన్ ఘన్‌పూర్, పాల్వంచ, మర్రిగూడ, గోదావరిఖనిలో గల పాత బస్టాండ్స్ కూల్చి వేసి వాటి స్థానంలో అత్యాధునిక సదుపాయాలు కలిగిన కొత్తవి నిర్మించనున్నారు.