ఇటీవల హైదరాబాద్ మెట్రో టికెట్ ఛార్జీల పెంపుపై విమర్శలు వెల్లువెత్తడంతో, 10 శాతం తగ్గిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. నేడు తగ్గించిన ఛార్జీల వివరాలు ప్రకటించి శనివారం నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది.
సవరించిన ఛార్జీల ప్రకారం మెట్రోలో కనిష్ట టికెట్ ధర: రూ.11 కాగా, మొదటి స్టేషన్ నుంచి చివరి స్టేషన్ వరకు గరిష్ట టికెట్ ధర రూ.69.
సవరించిన ఛార్జీలు ఈవిదంగా ఉండబోతున్నాయి:
0-2 కిమీ: రూ.11 (కనిష్ట టికెట్ ధర)
2 నుంచి 4 కిమీ: రూ.17.00,
4 నుంచి 6 కిమీ: రూ.28.00,
6 నుంచి 9 కిమీ: రూ. 37.00,
9 నుంచి 12 కిమీ: రూ.47.00,
12 నుంచి 15 కిమీ: రూ.51.00,
15 నుంచి 18 కిమీ: రూ.56.00,
18 నుంచి 21 కిమీ: రూ.61.00,
21 నుంచి 24 కిమీ: రూ.65.00,
24 కిమీ ఆ పైన: రూ.69.00.