వేసవి సెలవులు ప్రారంభం అవడంతో చాలా మంది కుటుంబ సమేతంగా పుణ్య క్షేత్రాల దర్శనాలకు బయలుదేరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది వెళుతుంటారు. ఇప్పుడు వారి సంఖ్య ఇంకా పెరిగింది. కనుక వేసవి రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మద్య రైల్వే సికింద్రాబాద్ నుంచి వికారాబాద్, గుంతకల్ మీదుగా తిరుపతికి 8 ప్రత్యేక రైళ్ళు నడిపిస్తోంది.
మే 8వ తేదీ నుంచి 30 వరకు వారానికి ఒక రోజు చొప్పున ఈ ప్రత్యేక రైళ్ళు నడుస్తాయని దక్షిణ మద్య రైల్వే ప్రకటించింది.
చర్లపల్లి నుంచి ప్రతీ ఆదివారం, శుక్రవారం రాత్రి 9.45 గంటలకు (ట్రైన్ నంబర్: 07017) బయలుదేరి మల్కాజ్ గిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా ప్రయాణించి మర్నాడు ఉదయం 10.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
ఇదే విదంగా మే 9 నుంచి 30 వరకు ప్రతీ సోమవారం, శనివారం సాయంత్రం 4.40 గంటలకు తిరుపతి నుంచి ట్రైన్ నంబర్: 07018 బయలుదేరి, పైన పేర్కొన్న స్టేషన్ల మీదుగా మర్నాడు ఉదయం 7.10 గంటలకు చర్లపల్లి టెర్మినల్ చేరుకుంటుంది.