మార్కెట్లలోకి భారత్‌ రైస్ వచ్చేస్తోంది

February 06, 2024
img

దేశంలో ధాన్యం సాగు, బియ్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగినా, బియ్యం ధరలు సామాన్య ప్రజలకు అందనంత ఎత్తులో ఉన్నాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ ధరలలో బియ్యం అందిస్తున్నప్పటికీ అవి తెల్ల రేషన్ కార్డులున్నవారికి మాత్రమే లభిస్తోంది. దేశ ప్రజలు ఎక్కువగా తినే సోనా మసూరి రకం బియ్యం ధర కేజీ రూ.75-85కి చేరుకుంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఈ బియ్యం ధరలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.  కేంద్ర ప్రభుత్వం వారి సమస్యను దృష్టిలో ఉంచుకుని ‘భారత్‌ రైస్’ని ప్రవేశపెట్టబోతోంది. ఈ బియ్యం ధర కేజీ రూ.29 మాత్రమే. 

కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేడు ఢిల్లీలో ఈ ‘భారత్‌ రైస్’ని లాంఛనంగా మార్కెట్లలోకి విడుదల చేయనున్నారు. ఈ బియ్యం 5,10 కేజీల బ్యాగులలో లభిస్తాయి. త్వరలో దేశవ్యాప్తంగా మార్కెట్లతో పాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, బిగ్‌ బాస్కెట్ వంటి ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో కూడా ప్రజలకు అందుబాటులోకి ఈ భారత్‌ రైస్ అందుబాటులోకి రానుంది.

Related Post