విశ్వక్ సేన్‌ కల్ట్ ట్రైలర్‌

October 20, 2026


img

మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘కల్ట్’ ట్రైలర్‌ వచ్చేసింది. ట్రైలర్‌ చూస్తే విశ్వక్ సేన్‌ దర్శకుడుగా తన ప్రతిభ నిరూపించుకోబోతున్నట్లు స్పష్టమవుతోంది. ట్రైలర్‌ ‘కల్ట్’పై అంచనాలు పెంచింది. కనుక అక్టోబర్ 30న విడుదల కాబోతున్న కల్ట్ కోసం సినీ అభిమానులు ఎదురుచూడవచ్చు. 

ఈ సినిమాలో విశ్వక్ సేన్‌, గాయత్రి భరద్వాజ్ జంటగా నటిస్తున్నారు. తారక్‌ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కార్తికేయ, అనిరుధ్‌ భాస్కర్‌, ఈజీ, యజ్ఞ తుర్లపాటి, కబీర్‌ భారతీయ, విశాఖ్‌ నాయర్‌, చేవూరి వివేక్‌ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

విశ్వక్‌ సేన్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్ట్‌’ సినిమాకు డైలాగ్స్‌: తరుణ్‌ భాస్కర్‌; సంగీతం: రవి బస్రూర్‌; సినిమాటోగ్రఫీ: అరవింద్‌ విశ్వనాథన్‌; స్టంట్స్‌: కరుణాకర్‌, జాషువా; ఆర్ట్‌: అరవింద్‌ మూలే; ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల.

తారక్ సినిమాస్, వాన్మయి క్రియేషన్స్ బ్యానర్లపై సందీప్‌ కాకరాల నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, జపనీస్ భాషల్లో అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Related Post

సినిమా స‌మీక్ష