మాస్ మేనల్లుడు మాధవ్ హీరోగా మారెమ్మ.. ట్రైలర్‌

September 01, 2026


img

మాస్ మహారాజా రవితేజ మేనల్లుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న ‘మారెమ్మ’ సినిమా ట్రైలర్‌ నేడు విడుదలైంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ రూరల్ యాక్షన్ డ్రామాలో మాధవ్‌కి జోడీగా దీపా బాలు నటించింది. వికాస్ వశిష్ట, వినోద్ కుమార్‌, రూపాలక్ష్మి, దయానంద్ రెడ్డి తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: మంచాల నాగరాజ్, సంగీత దర్శకుడు: ప్రశాంత్ ఆర్ విహారి, కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి,  ఎడిటింగ్: సాయిబాబు తలారి, ఆర్ట్: రాజ్‌కుమార్ మురుగేశన్, యాక్షన్: నటరాజ్ మడిగొండ చేస్తున్నారు. .

ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు, కిచా వెంకట్ కలిసి నిర్మించారు. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో మారెమ్మ ఈ నెల 10న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష