రామ్ చరణ్-జాన్వీ కపూర్ జంటగా చేసిన ‘పెద్ది’ చాలా భారీ అంచనాలతో జూన్ 4న థియేటర్లలో విడుదలైంది. రామ్ చరణ్‌తో సీనియర్ల నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఒక మంచి కథని హీరోయిన్ అందాల ప్రదర్శన, ఐటెం సాంగ్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ పాడు చేయడంతో పెద్దికి మిశ్రమ స్పందన వచ్చింది.
ఇప్పుడీ సినిమా ఈ నెల 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. తెలుగుతో పాటు నాలుగు భాషల్లో ఒకేసారి ప్రసారం అవుతుందని నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది.
బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో గుర్తింపుకు నోచుకోని ఓ కుగ్రామంలో గుర్తింపుకు నోచుకోని ఓ గ్రామీణ క్రీడాకారుడు పెద్దిగా (రామ్ చరణ్) నటించి మెప్పించారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు కలిసి పెద్ది నిర్మించారు.