తెలంగాణ సామాజిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘సర్కారు బాయి’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. లారా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యువ నటుడు శ్రీరామ్ నిమ్మల, వర్షిక జంటగా నటిస్తున్నారు. బాహుబలి ప్రభాకర్, నాగ చైతన్య మహేష్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి వారు శుభాకాంక్షలు తెలిపారు.
నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటాలు వంటి అంశాలతో 80లలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చిత్రబృందం తెలిపింది. ఈ నెల 17 నుంచి చేగుంట సమీపంలో రెడ్డిపల్లి గ్రామంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. డెక్కన్ ఫిలింస్ బ్యానర్‌పై తుమ్మల ఫుల్ రామ్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.