ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ (సబ్ టైటిల్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్)లో నయనతార, కియరా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ ఐదుగురు హీరోయిన్లు నటిస్ఉంతున్డనారు. కనుక దీనిపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి.
అందుకే ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ‘టాక్సిక్’ హక్కులను ఏకంగా రూ.120 కోట్లు ఇచ్చి సొంతం చేసుకున్నారు. టాక్సిక్ టీజర్ శుక్రవారం ఉదయం 9.35 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ పెట్టారు.
ఇదొక పీరియాడికల్ యాక్షన్ సినిమా. దీనికి కధ, దర్శకత్వం: గీతు మోహన్ దాస్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: రాజీవ్ రవి, స్టంట్స్: జేజే పెర్రీ (హాలీవుడ్), ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణతో కలిసి యష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి నిర్మించి తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో డబ్ చేసి మార్చి 19న విడుదల చేయబోతున్నారు.