పెద్ది టీమ్‌లో కుషిత?

February 15, 2026


img

బుచ్చిబాబు-రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ మార్చి 27న విడుదల కావాల్సి ఉండగా ఏప్రిల్‌ 30కి వాయిదా పడింది. ఈరోజుల్లో పెద్ద సినిమాలు ఇలా వాయిదా పడటం సర్వసాధారణమే. అయితే ఈ కొత్త డేట్‌తో ఓ కొత్త హీరోయిన్‌ కూడా లైన్లోకి వచ్చింది. ఆమె ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూఇన్సర్‌ కుషిత కల్లపు.

పెద్ది కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతంలో ఆమె రాజ్ తరుణ్‌తో కలిసి చిరంజీవ సినిమాలో నటించి మెప్పించారు. కనుక ఇప్పుడు పెద్ది టీమ్‌లో జాయిన్ అయ్యారా.. ఆవువుతున్నారా?అందుకే రిలీజ్ డేట్ పోస్టర్‌ షేర్ చేసి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.       

ఈ సినిమాలో పెద్దికి జోడీగా అచ్చియమ్మ (జాన్వీ కపూర్) నటిస్తున్న సంగతి తెలిసిందే. కనుక కుషిత రెండో హీరోయిన్‌గా నటిస్తున్నారా? లేక మరేదైనా పాత్ర చేస్తున్నారా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. 

ఈ సినిమాలో గ్రామీణ క్రికెటర్ పెద్దిగా నటిస్తున్న రామ్ చరణ్‌కు కోచ్ గౌరు నాయుడుగా ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్ కుమార్‌, విలన్ అప్పల సూరిగా జగపతి బాబు, క్రికెట్ బోర్డు చైర్మన్‌ లేదా సభ్యుడిగా బాలీవుడ్‌ నటుడు బొమ్మన్ ఇరానీ నటిస్తున్నారు.

ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు. 

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్న  పెద్ది 2026, ఏప్రిల్‌ 30న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష