తెలుగు సినిమాలకు ఏటా తెలంగాణ ప్రభుత్వం ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ఉగాది రోజున అవార్డులు ప్రధానం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా మార్చి 19న ఉగాది పండగరోజున గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది.
కనుక తెలుగు సినిమాలలో వివిధ విభాగాల కింద గద్దర్ అవార్డుల ఎంపిక కొరకు స్క్రీనింగ్ కమిటీ (జ్యూరీ) రేపు సమావేశం కాబోతోంది. ఈఏడాది డా.సి.నారాయణ రెడ్డి, అక్కినేని నాగేశ్వర రావు పేరిట రెండు ప్రత్యేక అవార్డులు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.
సినిమా షూటింగు మొదలు పోస్ట్ ప్రొడక్షన్ వరకు సినీ పరిశ్రమకి కావాల్సినవన్నీ హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి. అందుకే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సినిమాలు తీస్తున్నారు. కనుక ఇప్పుడు హైదరాబాద్‌ని హాలీవుడ్ స్థాయిలో సినీ రాజధానిగా మార్చేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశాము.
హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందితే వేలాదిమందికి పని లభిస్తుంది. తమ ప్రతిభని చాటుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి,” అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.