అడవి శేష్, మృణాళినీ ఠాకూర్ జంటగా చేస్తున్న‘డెకాయిట్-ఒక ప్రేమ కధ’ మార్చి 19న విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా పడుతుందని కొన్నిరోజులుగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ ఏప్రిల్ 10న డెకాయిట్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడం వల్లనే సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
షానీల్ డియో దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అడవి శేష్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జాన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే: అడవి శేష్, షనీల్ డియో, డైలాగ్స్: అబ్బూరి రవి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ధనుష్ భాస్కర్, ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్, యాక్షన్: ఏ విజయ్ చేస్తున్నారు.
డెకాయిట్ యాక్షన్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ కలిసి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది.