అదరగొడుతున్న విశాల్ డిటెక్టివ్ ట్రైలర్

September 12, 2017


img

యువ హీరోలతోనే ఎక్కువగా సినిమాలు తీసే మిస్కిన్ మొదటిసారి కోలీవుడ్ లో స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన 'పిశాచి' మూవీని తెరకెక్కించింది ఈయనే. డిఫరెంట్ కథాంశంతో ఆ మూవీ ప్రేక్షకులను భయబ్రాంతులకు గురి చేసిన విషయం తెలిసిందే. 

కొత్త వాళ్ళతో సినిమాలు తెరకెక్కించే మిస్కిన్ కి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. తమిళ స్టార్ హీరో విశాల్ తో మూవీని తెరకెక్కించే అవకాశం వచ్చింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'తుప్పారివాలన్'. ఈ మూవీలో విశాల్ డిటెక్టివ్ గా కనిపించనున్నారు.     

తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇందులో డిఫరెంట్ లుక్ తో విశాల్ కనిపిస్తున్నారు. రొటీన్ గా కనిపించే విశాల్ లుక్ మారడంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు. ఈ మూవీని ఈ గురువారమే రిలీజ్ చేయనున్నారు. సీరియల్ హత్యలను ఛేదించే డిటెక్టివ్ పాత్రలో విశాల్ కనిపించనున్నాడు. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.

Related Post

సినిమా స‌మీక్ష