కొరటాల శివ అలా బుక్కయ్యాడు

February 12, 2020


img

రైటర్ నుండి డైరెక్టర్ గా మారి స్టార్ తో సినిమాలు చేస్తున్నా వారి కెరియర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చే దర్శకుడిగా మారాడు కొరటాల శివ. భరత్ అనే నేను తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్న కొరటాల శివ మెగా టీమ్ తో డిస్టర్బ్ అవుతున్నాడని తెలుస్తుంది. సినిమా ఎనౌన్స్ చేయడమే లేట్ అనుకుంటే షూటింగ్ మరింత లేట్ అవుతుందట. అంతేకాదు సినిమాలో రామ్ చరణ్ చిరు యంగ్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే.. అయితే ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. RRR పూర్తయ్యే వరకు చరణ్, తారక్ లను మరే సినిమా చేయొద్దని అన్నాడట రాజమౌళి. 

సినిమాలో చరణ్ కూడా ఉంటే స్పెషల్ క్రేజ్ వస్తుందని స్క్రిప్ట్ టైం లోనే చరణ్ రోల్ కు ఇంపార్టెన్స్ ఇచ్చారట. ఇప్పుడు కచ్చితంగా చరణ్ వచ్చే వరకు షూటింగ్ ఆపాల్సిందే. అసలైతే ఆగష్టు కల్లా సినిమా రిలీజ్ చేయాలని అనుకోగా అది కాస్త 2021 సమ్మర్ దాకా వాయిదా పడేలా ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష