బన్ని కోసం పరశురామ్

December 11, 2018


img

గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు పరశురాం సినిమా వచ్చి నాలుగు నెలలు అవుతున్నా సరే తన తర్వాత సినిమాపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. బయట నిర్మాతలు ఆఫర్లు ఇస్తున్నా గీతా ఆర్ట్స్ లోనే సినిమా లాక్ చేశాడట. తను రాసుకున్న రెండు కథలకు హీరోలు కరువయ్యారని తెలుస్తుంది. అందుకే అల్లు అర్జున్ కు సరిపోయే ఓ కథ రాసుకున్నాడట పరశురాం. 

ఇప్పటికే బన్ని లైన్ ఓకే చేశాడని తెలుస్తుంది. అంతా కుదిరితే అల్లు అర్జున్ చేయబోయే నెక్స్ట్ సినిమా ఇదే అంటున్నారు. అసలైతే అల్లు అర్జున్ త్రివిక్రం కాంబినేషన్ లో సినిమా మొదలు కావాల్సి ఉంది. ఆ సినిమా కథ ఇంకా సిద్ధం కాలేదని తెలుస్తుంది. అందుకే పరశురాం సినిమాకు బన్ని మొగ్గుచూపుతున్నాడట. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉంటుందని అంటున్నారు. మరి పరశురాం, బన్ని కాంబో సినిమా నిజంగా సెట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష