అందుకే కరోనా టీకా వేసుకొన్నాను: టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే

January 25, 2021
img

తెలంగాణ వ్యాప్తంగా నేటి నుండి ప్రైవేటు ఆసుపత్రులలో పనిచేసే సిబ్బందికి కూడా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. జగిత్యాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. 

ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ప్రజల్లో కరోనా వాక్సిన్ పట్ల అనుమానాలు, అపోహలు నెలకొని ఉన్నందున వాటిని తొలగించి ప్రజలకు నమ్మకం కలిగించేందుకే వాక్సిన్ తీసుకున్నానని తెలిపారు. కనుక ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా వ్యాక్సిన్ ను తీసుకోవాలని సంజయ్ పిలుపునిచ్చారు. అయితే వ్యాక్సిన్‌ తీసుకొనేవారు ఏవైనా ఆరోగ్య సమస్యలున్నట్లయితే ఆ విషయం ముందుగా వైద్యులకు తెలియజేయాలని సూచించారు. అప్పుడు వ్యాక్సిన్‌ ఇవ్వాలా వద్దా అనేది వైద్యులు నిర్ణయిస్తారని అన్నారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం రాష్ట్రంలో చివరి వ్యక్తికి కూడా వేసేవరకు నిరంతరంగా సాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఐదువేల ప్రైవేట్ ఆస్పత్రులకు వాక్సిన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. బుధవారం, శనివారం తప్ప మిగతా అన్ని రోజులలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంటుందని సంజయ్ తెలిపారు.

Related Post