మరో టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేకు కరోనా

August 03, 2020
img

రాష్ట్రంలో అధికార టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు వరుసగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. పఠాన్‌చెరు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష్లు చేయించుకోగా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దాంతో ఆయన వెంటనే హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారందరూ హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా, గొంగిడి సునీతజీవన్ రెడ్డిలు కరోనా బారినపడి కోలుకొన్నారు.   


Related Post