సిద్ధిపేటలో కరోనా పాజిటివ్ కేసు..కేరాఫ్ నిజాముద్దీన్‌

April 01, 2020
img

సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో బుదవారం ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. సిద్ధిపేట నుంచి మొత్తం ఆరుగురు వ్యక్తులు డిల్లీ, నిజాముద్దీన్‌ మత సమావేశాలకు హాజరై తిరిగివచ్చినట్లు సమాచారం అందుకొన్న జిల్లా వైద్య బృందాలు వారందరినీ సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి తరలించి కరోనా పరీక్షలు జరిపించగా వారిలో 51 ఏళ్ళు వయసున్న ఓ వ్యక్తికి పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఈరోజు ఆయనను ప్రత్యేక అంబులెన్సులో సికింద్రాబాద్‌, గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మిగిలినవారి రిపోర్టులు ఇంకా రావలసి ఉంది. రాష్ట్రం నుంచి ఇంకా చాలా మంది డిల్లీ, నిజాముద్దీన్‌ మత సమావేశాలకు హాజరై తిరిగివచ్చారు. వారిద్వారా రాష్ట్రంలో ఇతరులకు కూడా కరోనా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉంది కనుక వారిని గుర్తించేందుకు పోలీసులు, ఆరోగ్యవైద్య సిబ్బంది అన్ని జిల్లాలలో గాలిస్తున్నారు.  వారికి సంబందించి సమాచారం అందించవలసిందిగా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


Related Post