హైదరాబాద్‌లో ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ!

March 19, 2019
img

ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలా ఖరీదైన వ్యవహారమని అందరికీ తెలుసు. కనుక సామాన్య ప్రజలలో కొంతమందికి ప్రమాదవశాత్తూ లేదా ఇతరుల దాడిలో కాళ్ళు, చేతులు, మొహం తదితర శరీరభాగాలు కాలిన గాయాలతో వికృతం మారినప్పటికీ, ఆర్ధికస్తోమత్తులేక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేక అలాగే ఇబ్బందిపడుతూ జీవిస్తుంటారు. అటువంటివారికి ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ చేసేందుకు ముందుకు వచ్చింది ‘బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్.’ 

కాలినగాయాలతో అంగవైకల్యానికి గురైన బాధితులకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ చేస్తామని ట్రస్ట్ ఫౌందర్ నిహారి మండల్ తెలిపారు. డాక్టర్ హరి కిరణ్ నేతృత్వంలో ఓ వైద్య బృందం హైదరాబాద్‌లో ప్లాస్టిక్ సర్జరీలు చేయబోతోందని తెలిపారు. కనుక కాలినగాయాలతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఉచిత శస్త్ర చికిత్స చేయించుకొదలచినవారు ఈనెల 23లోగా తమ పేర్లను 76809 74918 ఫోన్ నెంబరుకు ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేయించుకోవలసిందిగా మండల్ కోరారు. మై తెలంగాణ.కామ్ పాఠకులు లేదా వారి బందుమిత్రులలో ఎవరికైనా అవసరమున్నట్లయితే ఈ విషయం వారికి వెంటనే తెలియజేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

Related Post