కామారెడ్డిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు మృతి

February 18, 2019
img

కామారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేస్తున్న రాజన్(26), లక్ష్మి నారాయణ (32) మృతి చెందారు. వారితోపాటు కారులో ప్రయాణిస్తున్న విజయ్, కోమల్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారు నలుగురూ కారులో షిర్డీ వెళ్ళి హైదరాబాద్‌ తిరిగివస్తుండగా మద్నూరు మండలం మేనూరు గ్రామం వద్ద గల పెట్రోల్ బంక్ సమీపంలో వారి కారును ఎదురుగా వస్తున్నలారీ బలంగా డ్డీకొట్టడంతో ముందు సీట్లలో ఉన్న రాజన్, లక్ష్మినారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని తీవ్రంగా గాయపడిన విజయ్, కోమల్ సింగ్ లకు మద్నూరులో అత్యవసర చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు. రాజన్, లక్ష్మినారాయణ శవాలను పోస్ట్ మార్టం నిమిత్తం మద్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని సమాచారం. 


Related Post