ఒకటీ రెండూ కాదు...145 వాహనాలు

May 07, 2018
img

దేశ వ్యాప్తంగా ఎప్పుడు ఎక్కడ ప్రమాదం జరిగినా, ఏ ప్రాంతంలో ఎవరు అకస్మాత్తుగా అనారోగ్యం పాలైనా ప్రజలకు టక్కున గుర్తుకు వచ్చేది 108 అంబులెన్సులే. వాటి నిర్వహణలో కొన్ని లోపాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ, దేశంలో పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అత్యుత్తమ సేవలు అందిస్తున్నవాటిలో 108 అంబులెన్స్ సర్వీసులేనని చెప్పకతప్పదు. కనుక 108 అంబులెన్స్ వాహనాలు సమాజంలో ఒక భాగం అయిపోయాయని చెప్పవచ్చు.

108 అంబులెన్స్ సర్వీసుల ప్రాధాన్యతను, అవి సామాన్య ప్రజలకు అందిస్తున్న అపూర్వమైన సేవలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణా ప్రభుత్వం వాటి సంఖ్యను ఇంకా పెంచాలని నిర్ణయించింది. నిజానికి తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఈ ఆలోచన చేసింది. అప్పటికి రాష్ట్రంలో కేవలం 60 అంబులెన్సులే ఉండేవి. కనుక మొదట 145 అంబులెన్సులు కొనుగోలు చేసింది. మళ్ళీ ఈ ఏడాది మరో 145 కొనుగోలు చేసింది. వాటిని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు మంగళవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్రారంభించబోతున్నారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 350 అంబులెన్సులు అవుతాయి. అంటే సగటున ఒక్కో జిల్లాకు 11 అంబులెన్సులు ఏర్పాటయ్యాయన్న మాట. ప్రజారోగ్యం గురించి తెరాస సర్కార్ ఇంత శ్రద్ధ చూపడం చాలా అభినందనీయం. 


Related Post