అక్టోబర్ 15 నుంచి విద్యా సంవత్సరం షురూ

July 09, 2020
img

కరోనా నేపధ్యంలో ఈ ఏడాది అన్ని రకాల కోర్సులకు విద్యాసంవత్సరం మార్చుకోకతప్పడం లేదు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ సూచన మేరకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కూడా అకాడమిక్ క్యాలెండర్‌ను మార్చింది. దాని ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని వృత్తి, సాంకేతిక విద్యలకు సంబందించి విద్యాసంవత్సరం ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి ప్రారంభం అవుతుందని ఏఐసీటీఈ ఈరోజు ప్రకటించింది. ఈ మేరకు సవరించిన విద్యా క్యాలెండర్‌ను  విడుదల చేసింది. 

ఇప్పటికే మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్దులకు, కొత్తగా టెక్నికల్ కోర్సులలో చేరేవారికి ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి, మిగిలినవారికి అక్టోబర్ 17 నుంచి తరగతులు మొదలవుతాయని ఏఐసీటీఈ ప్రకటించింది. మేనేజిమెంట్ ప్రోగ్రాం, సంబందిత కోర్సులకు ఆగస్ట్ 17లోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తిచేసి, అక్టోబర్‌ 5లోపు మొదటి విడత కౌన్సిలింగ్, అక్టోబర్‌ 15లోగా రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తి చేయాలని సూచించింది. అక్టోబర్ 20నాటికి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసి క్లాసులు నిర్వహించేందుకు సిద్దంగా ఉండాలని ఆదేశించింది.

Related Post