మెట్రో స్మార్ట్ కార్డులపై 10% రాయితీ

December 07, 2017
img

హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించడానికి ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డులపై 10% రాయితీని ఎల్&టి సంస్థ ప్రకటించింది. ఈ రాయితీ 2018, మార్చి 31వరకు ఉంటుందని తెలిపింది. అదిగాక పేటిఎం ద్వారా తొలిసారి రీ-ఛార్జ్ చేసుకొన్నట్లయితే రూ.100, ఆ తరువాత ప్రతీ రీ-ఛార్జ్ పై రూ.20 క్యాష్ బ్యాక్ అందిస్తామని ఎల్&టి సంస్థ ప్రకటించింది. స్మార్ట్ కార్డులు తీసుకొన్నట్లయితే టికెట్ల కోసం క్యూలైన్లలో నిలబడనవసరం ఉండదు కనుక మెట్రో ప్రయాణం మరింత సులువవుతుందని తెలిపింది. స్మార్ట్ కార్డులను అన్ని మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంచుతున్నామని, అలాగే వాటిని మెట్రో స్టేషన్లలో టికెట్ కౌంటర్స్ వద్ద, స్టేషన్లో పెయిడ్ ఏరియాలలో గల ‘యాడ్ వాల్యూ మెషిన్ల’ ద్వారా, టి-సవారి మొబైల్ యాప్, పేటిఎం, హెడ్ మెట్రో రైల్ అధికారిక వెబ్ సైట్స్ ద్వారా స్మార్ట్ కార్డులను రీ-ఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. స్మార్ట్ కార్డ్ వినియోగం ద్వారా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో తమకు తోడ్పడాలని ఎల్&టి సంస్థ ప్రజలను కోరింది.        


Related Post