ఆ సిమ్ కార్డులు ఫిబ్రవరిలో డీయాక్టివేట్?

September 11, 2017
img

కొత్త సిమ్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు వివరాలు సమర్పించడం తప్పనిసరని అందరికీ తెలుసు. అయితే మొదట్లో ఈ నిబందన ఉండకపోవడంతో చాలా మంది ఆధార్ లేకుండానే సిమ్ కార్డులు పొందారు. అటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా తమ సిమ్ కార్డులను ఆధార్ తో లింకేజ్ చేసుకోవడం ఇప్పుడు తప్పనిసరి లేకుంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి తరువాత ఎప్పుడైనా వారి సిమ్ కార్డులు డీయాక్టివేట్ చేయబడతాయి. ఈ విషయం ఇప్పటికే టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకు తెలియజేస్తున్నాయి. 

గతంలో ఈ నిబంధన లేనప్పుడు సంఘ విద్రోహశక్తులు, ఉగ్రవాదులు, వేర్పాటువాదులు తదితరులు నకిలీ దృవపత్రాలు, నకిలీ చిరునామాలతో సిమ్ కార్డులు తీసుకొనడం వలన నిఘావర్గాలకు వారిని గుర్తించడం కష్టం అయ్యేది. ఈ సమస్యను అధిగమించడానికే ఇప్పుడు ఈ నిబంధనను కటినంగా అమలుచేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. కనుక ఏ కంపెనీ సిమ్ కార్డు ఉపయోగిస్తున్నప్పటికీ అందరూ వీలైనంత త్వరగా వాటిని ఆధార్ తో లింక్ చేసుకోవడం మంచిది. 

Related Post