కరోనా మందు ధర తగ్గింది

July 13, 2020
img

కరోనా సోకిన తరువాత వ్యాధిని నియంత్రించి అరికట్టేందుకు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారుచేసిన ఫాబిఫ్లూ ట్యాబ్లెట్ ధరను తగ్గిస్తున్నట్లు ఆ సంస్థ ఇండియా బిజినెస్ హెడ్, సీనియర్ కరోనా వైరస్‌కు ప్రెసిడెంట్ అలోక్ మాలిక్ ప్రకటించారు. మొదట్లో ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ.103తో మార్కెట్లోకి విడుదల చేశామని, కానీ ఇప్పుడు భారత్‌లోనే తక్కువ ఖర్చుతో భారీస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నందున ధరను రూ.75కు తగ్గిస్తున్నట్లు చెప్పారు. అంటే ఒకేసారి ఒక్కో మాత్రపై రూ.28 తగ్గిందన్నమాట. ప్రస్తుతం ఇది కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇదిగాక రెండు వేర్వేరు యాంటీవైరల్ మందులైన షావిపిరవీర్ మరియు ఉమిఫెనొవీర్ మాత్రలను క్లినికల్ ట్రయల్స్‌లో పరీక్షిస్తున్నామని అలోక్ మాలిక్ తెలిపారు. త్వరలోనే వాటిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.  

Related Post