భారత్‌లో పట్టాలెక్కనున్న ప్రైవేట్ రైళ్ళు

July 02, 2020
img

త్వరలో దేశవ్యాప్తంగా ప్రైవేట్ రైళ్ళు పట్టాలెక్కబోతున్నాయి. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ అధ్వర్యంలో తేజస్ పేరుతో కొన్ని ప్రైవేట్ మెట్రో రైల్‌లో సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంచి లాభదాయకత ఉన్న మరో 109 మార్గాలను 12 క్లస్టర్లుగా విభజించి వాటిలో 151 జతల ప్రైవేట్ రైళ్ళను నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దాని కోసం రైల్వేశాఖ బుదవారం ‘రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్’ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 

‘రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్’ ప్రక్రియలో సదరు సంస్థల ఆర్ధికస్తోమత, వ్యాపార సామర్ధ్యం, రైళ్ళను నడిపించడంపై వాటికున్న అవగాహన, ఆసక్తి వంటి ఆర్ధిక, సాంకేతిక అంశాలను రైల్వేశాఖ పరిశీలించి అర్హత కలిగిన సంస్థలను ఎంపికచేస్తుంది. దీనిద్వారా రైల్వేలకు సుమారు రూ.30,000 కోట్లు అదనపు ఆదాయం సమకూరవచ్చునని భావిస్తోంది. ఈ ప్రైవేట్ రైళ్ళు సాధారణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళకు భిన్నంగా తేజస్ లేదా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ తరహాలో అత్యాధునిక సౌకర్యాలు కలిగి గంటకు 160కిమీ వేగంతో నడిపించాలని రైల్వేశాఖ భావిస్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ పధకంలో భాగంగా ‘ట్రెయిన్-18’ పేరుతో అత్యాధునిక సౌకర్యాలు, గంటకు 160కిమీ వేగంతో ప్రయాణించే సెమీ హైప్సీడ్ రైలును దేశీయంగా తయారుచేసిట్లే, ఈ  ప్రైవేట్ రైళ్ళను కూడా దేశీయంగా తయారుచేయాలని రైల్వేశాఖ భావిస్తోంది.

Related Post