జియో కరోనా ఆఫర్!

March 24, 2020
img

పండగల సందర్బంగా డిస్కౌంట్లు ఆఫర్లు గురించి విన్నాము కానీ కరోనా వైరస్‌ కూడా ఆఫర్లు ప్రకటించడానికి ఉపయోగించుకోవచ్చునని జియో నిరూపించి చూపుతోంది. కరోనా ప్రభావంతో ఇప్పుడు ఐ‌టి కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయ ఉద్యోగులకు తమ తమ ఇళ్ళ నుంచే పనిచేసుకొనేందుకు అనుమతిస్తున్నాయి. కానీ అందుకు ఇంటర్నెట్ కనెక్షన్, డాటా కావాల్సి ఉంటుంది కదా?అదే జియోకు గొప్ప వ్యాపార అవకాశంగా కనిపించింది. వెంటనే ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆఫరును ప్రకటించింది. 

ఈ ప్లానులో కేవలం రూ.251లకే రోజుకు 2జీబీ డేటా అందిస్తోంది. ఈ ప్లాన్ కాలవ్యవధి 51 రోజులు. ఇది కేవలం ఇంట్లో నుంచి ఆఫీసు పనిచేసుకోవడానికే కనుక దీనిలో డేటా తప్ప ఉచిత కాల్స్, మెసేజులు వంటివేవీ అందించడం లేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తో కూడా బిజినెస్ చేయవచ్చని, ఆలోచిస్తే అనర్ధంలో అవకాశాలు ఉంటాయని జియో నిరూపిస్తోంది. 


Related Post