నేటి అర్ధరాత్రి నుంచి దేశీయ విమానసేవలు కూడా రద్దు

March 24, 2020
img

దేశంలో కరోనా వైరస్‌ కట్టడికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కటినమైన నిర్ణయాలు తీసుకోకతప్పడం లేదు. ఇప్పటికే అంతర్జాతీయ విమానసేవలను నిలిపివేసిన కేంద్రప్రభుత్వం, ఇప్పుడు దేశీయ విమానసేవలను కూడా నిలిపివేయాలని నిర్ణయించింది. రేపు అంటే మార్చి 24 అర్ధరాత్రి 12 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వెలువడేవరకు దేశీయ విమానసేవలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయానశాఖ ప్రకటిచింది. కనుక బుదవారం అర్ధరాత్రిలోగా అన్ని విమానాలు తమ గమ్యస్థానాలు చేరుకొనేలా అవసరమైన మార్పులు చేసుకోవాలని విమానయాన సంస్థలకు సూచించింది. ఈ కంటికి కనబడని కరోనా మహమ్మారి ఇంకా ఎంతకాలం ప్రపంచాన్ని పట్టిపీడిస్తుందో తెలియదు కానీ దానిలాగే ప్రపంచంలో కంటికి కనబడని ఆర్ధికవిధ్వంసం జరిగిపోతోంది.  


Related Post