నిత్యావసర వస్తువులపై వడ్డింపు...

February 01, 2020
img

ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్రఆర్ధిక బడ్జెట్‌లో ప్రజలకు నిత్యావసరమైన వస్తువుల ధరలు పెరిగేలా పన్నులు వడ్డించారు. చెప్పులు, షూస్, చీపుర్లు, దువ్వెనలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, కొన్ని రకాల మద్యం, చిన్నపిల్లల బొమ్మలు, సైకిళ్లు, మంచాలు, కుర్చీలు, పరుపులు, దుప్పట్లు, ఫాన్లు, మిక్సీలు, గ్రైండర్లు, ట్రిమ్మర్స్, వాటర్ హీటర్లు, హెయిర్ డ్రయ్యర్లు, ఓవెన్స్, కుక్కర్లు, కాఫీ/టీ మేకర్స్, ఇస్త్రీపెట్టెలు, ఆఫీస్ స్టేషనరీ, లైటింగ్ సిస్టమ్స్, ఫర్నీచర్, కిచెన్‌వేర్, గ్లాస్‌వేర్ మొబైల్ ఫోన్లు మొదలైన వస్తువుల ధరలు పెరుగనున్నాయి. అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వైద్య పరికరాలు, విద్యుత్ వాహనాలు, కమర్షియల్ వాహనాల విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి.

నిత్యావసర సరుకులలో పాలు, పాలపొడి, పంచదార, వ్యవసాయ పాడి ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. అలాగే    తక్కువ బరువు ఉండే కాగితం, న్యూస్‌ప్రింట్, క్రీడలకు సంబందించిన వస్తువులు, పరికరాలు, ప్యూరిఫైడ్ టెరిప్తాలిక్ యాసిడ్‌, సోయా ఫైబర్, సోయా ప్రొటీన్ వంటి వస్తువుల ధరలు తగ్గుతాయి. 


Related Post