త్వరలో అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు

August 19, 2019
img

హైదరాబాద్‌ మెట్రోలోని అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ కారిడార్‌ అత్యంత రద్దీగా ఉంటుంది కానీ ఆ మార్గంలో చాలా తక్కువ మెట్రో రైళ్లు తిప్పుతున్నారు. హైటెక్ సిటీ వద్ద మెట్రో రైల్ వెనక్కు మళ్ళేందుకు రివర్సల్ సిస్టమ్ సిద్దం కాకపోవడం వలననే ఈ సమస్య ఏర్పడింది. కొన్ని రోజుల క్రితమే రివర్సల్ సిస్టమ్ పనులన్నీ పూర్తవడంతో దానిని వినియోగించేముందు రైల్వే సేఫ్టీ అధికారులు భద్రతాపరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరో రెండు మూడులలోనే అవి పూర్తయ్యే అవకాశం ఉంది కనుక రివర్సల్ సిస్టమ్ ను ఉపయోగించేందుకు రైల్వే సేఫ్టీ అధికారుల నుంచి అనుమతి లభించగానే అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ మార్గంలో కూడా 3-5 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో రైళ్లను నడిపించడానికి మెట్రో రైల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బహుశః ఈ వారంలోనే ఈ మార్గంలో ప్రతీ3-5 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో రైళ్లను నడిపించే అవకాశం ఉంది.


Related Post