జియో ఫైబర్ నెట్‌ ప్లాన్స్ వివరాలు

August 12, 2019
img

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఇక ఇంటర్నెట్, డిటిహెచ్ రంగంలో సంచలనాలు సృష్టించడానికి సిద్దం అవుతోంది. ఈరోజు ముంబైలో జరిగిన రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, “సెప్టెంబర్ 5నాటికి జియో ప్రారంభించి మూడేళ్లు పూర్తవుతాయి. ఆ సందర్భంగా ఆరోజు నుంచే దేశవ్యాప్తంగా 1,600 నగరాలు, పట్టణాలలోని 2 కోట్ల నివాసాలలో, 1.5 కోట్ల వాణిజ్య భవనాలలో జియో ఫైబర్ సేవలు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాము,” అని తెలిపారు.      

జియో ఫైబర్ సేవల గురించి ముఖేష్ అంబానీ పిల్లలు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ వివరించారు.  

స్పీడ్: కనీసం స్పీడ్ 100 ఎంబీపీఎస్ గరిష్టంగా 1 జీబీపిఎస్  

ఛార్జీలు: నెలకు రూ.700 గరిష్ట ధర రూ.10,000 

ప్రీమియం కస్టమర్లకు: 2020 సం.నుంచి మొదలయ్యే ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్లాన్‌లో కొత్త సినిమాలను ధియేటర్లలో విడుదలైన రోజునే ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు.

జియో ప్రారంభ ఆఫర్: జియో ఫైబర్ వార్షిక ప్లాన్ తీసుకుంటే హెచ్.డి/4కె, ఎల్ఈడీ టీవీ, సెట్ టాప్ బాక్స్ ఉచితంగా పొందవచ్చు. 

దేశంలో అన్ని నెట్‌వర్క్‌ లకు ఉచితంగా వాయిస్ కాల్స్ చేస్కోవచ్చు. 

నెలకు రూ.500 ఛార్జీలతో అమెరికా, కెనడాకు అపరిమిత కాలింగ్‌ చేసుకోవచ్చు. 

Related Post