టీవీ-9ను స్వాధీనం చేసుకొన్న కొత్త యాజమాన్యం

May 10, 2019
img

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ-9 నుంచి దాని వ్యవస్థాపక అధ్యక్షుడు రవిప్రకాష్ ను తొలగించిన తరువాత అలంద మీడియా దానిని నేడు పూర్తిగా స్వాధీనం చేసుకొంది. అనంతరం డైరక్టర్లలో ఒకరైన సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ, “ టీవీ-9లో 90.5 శాతం వాటా ఉన్న మమ్మల్ని రవిప్రకాష్ చాలా ఇబ్బంది పెట్టారు. కనుక కంపెనీ నిబందల ప్రకారమే ఆయనను తొలగించాము. ఇకపై ఆయనకు టీవీ-9 సంస్థతో ఎటువంటి సంబందామూ ఉండదని పూర్తిగా అలందా మీడియా చూసుకొంటుంది,” అని చెప్పారు. 

టీవీ-9 కన్నడ ఛానల్ కు హెడ్ గా వ్యవహరిస్తున్న మహేంద్ర మిశ్రాను టీవీ-9కు తాత్కాలిక సీఈఓగా, సింగారావును సీఓఓగా నియమించినట్లు సాంబశివరావు తెలిపారు. సంస్థలో ఉన్నతస్థాయిలో జరిగిన ఈ మార్పులను చూసి ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని అందరూ యధాతధంగా తమ విధులను నిర్వహించుకోవాలని, అవసరమైతే మరికొంత మందిని నియమిస్తామని సాంబశివరావు తెలిపారు. 

ఇప్పటివరకు టీవీ-9 దాదాపు నిర్భయంగా, నిష్పక్షపాతంగా వర్తమాన రాజకీయాల గురించి, రాజకీయ పార్టీల గురించి రిపోర్ట్ చేసేది. యాజమాన్యం మారిన తరువాత కూడా టీవీ-9 అదే ఉన్నత ప్రమాణాలు పాటిస్తుందా లేక ఏదో ఒక రాజకీయపార్టీకి బాకా మీడియగా మారిపోతుందా  కాలమే చెపుతుంది. 

Related Post