ఇక నుంచి లింగంపల్లి వరకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌

April 16, 2019
img

విశాఖపట్నం-సికిందరాబాద్‌ మద్య నడుస్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ ప్రజల అభ్యర్ధన మేరకు లింగంపల్లి రైల్వేస్టేషన్‌ వరకు పొడిగింపబడింది. సోమవారం ఉదయం 6.15 గంటలకు లింగంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి విశాఖకు బయలుదేరింది. లింగంపల్లి స్టేషన్ అధికారులు దీనికి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలును లింగంపల్లి పొడిగించడం వలన లింగంపల్లి, చందానగర్, రామచంద్రాపురం, నెహ్రూ నగర్, నల్లగండ్ల, తెల్లాపూర్, మియాపూర్ ప్రాంతాలలో నివసిస్తున్నవారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. సికిందరాబాద్‌ రైల్వేస్టేషన్‌ వరకు వెళ్ళనవసరం లేకుండానే లింగంపల్లి స్టేషన్ నుంచే విశాఖకు రాకపోకలు సాగించవచ్చు. 


Related Post