సామాన్యుల నెత్తిన బండ

October 01, 2018
img

ఒకపక్క అడ్డు అదుపూ లేకుండా రోజూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న ప్రజలపై పెట్రోలియం కంపెనీలు మరింత భారం మోపాయి. సబ్సీడీ, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేశాయి. సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.89, కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.59 పెంచేశాయి. డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఛార్జీలు కూడా పెరుగుతాయి కనుక ఆ ప్రభావం నిత్యావసర వస్తువులు, కూరగాయలపై కనిపిస్తోంది. ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా పెంచడంతో సామాన్యులపై మరింత భారం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం వలననే గ్యాస్ ధరలు పెంచక తప్పలేదని ఆయిల్ కంపెనీలు పాత పాటే పాడుతున్నాయి. 


Related Post