వాంటెడ్ సేల్స్ మెన్: పతంజలి

June 20, 2018
img

బహుశః ఏ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ చేయలేని స్థాయిలో పతంజలి సంస్థ సాహసం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి 50,000 మంది సేల్స్ మెన్ నియమించుకోవడానికి ప్రకటన ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఒక్కో జిల్లాలో 50 మంది చొప్పున సేల్స్ మ్యాన్ నియమించుకోబోతోంది. పతంజలి సంస్థ ఉత్పత్తి చేసే ఆహార, ఆరోగ్య తదితర ఉత్పత్తులను షోరూములలోను, ఇంటింటికీ తిరిగి అమ్మడానికిగాను50,000 మంది సేల్స్ మెన్ నియమించుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది.

ఈ ఉద్యోగాలకు కనీసఅర్హత 12వ తరగతి. కనీస జీతం నెలకు రూ.8,000 ఇస్తామని ప్రకటనలో పేర్కొంది. బిఏ, ఎంఏ, ఎంబిఏ డిగ్రీలు చేసిన వారికి పనిని బట్టి నెలకు రూ.15,000 వరకు జీతం ఇస్తామని ప్రకటనలో తెలిపింది. సేల్స్ రంగంలో రెండేళ్ళు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ఈ ఉద్యోగాల కొరకు స్థానిక పతంజలి కో-ఆర్డినేటర్ ను ఫోన్ ద్వారా సంప్రదించవలసిందిగా సూచించింది. ఈనెల 22 వ తేదీ నుంచి ఇంటర్వ్యూల ప్రక్రియ మొదలుపెడతామని తెలిపింది. అయితే అభ్యర్ధులు ముందుగా స్థానిక కో-ఆర్డినేటర్ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఇంటర్వ్యూలలో ఎంపిక అయినవారికి వెంటనే శిక్షణ కార్యక్రమం ఉంటుంది. పతంజలి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వారికి జీతాలు చెల్లించబడతాయి. పూర్తి వివరాలకు క్రింద ఇచ్చిన బ్రోచర్ ను చూడగలరు. 


Related Post