బి.ఎస్.ఎన్.ఎల్. తాజా ప్లాన్

May 18, 2018
img

ప్రస్తుతం దేశంలో జియోకు గట్టిగా పోటీ ఇస్తున్న టెలికాం కంపెనీలలో బి.ఎస్.ఎన్.ఎల్. ముందుంది. జియో, ఎయిర్ టెల్ సంస్థలు రూ.149కే రోజుకు 1.5 జిబి డేటా, రోజుకు 100 ఎస్.ఎం.ఎస్.లు, అపరమిత వాయిస్ కాల్స్ అందిస్తుండగా, వాటికి పోటీగా బి.ఎస్.ఎన్.ఎల్. శుక్రవారం ఒకేసారి రెండు ఆకర్షణీయమైన ప్లాన్స్ ప్రకటించింది. 

వీటిలో రూ.118 ప్లానులో రోజుకు 1 జిబి డేటా, రోజుకు 100 ఎస్.ఎం.ఎస్.లు, అపరమిత వాయిస్ కాల్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని కాల వ్యవధి 28 రోజులు. అంటే జియో కంటే రోజుకు 0.5 జిబి డేటా తక్కువ ఇస్తున్నప్పటికీ జియో కంటే రూ.31 తక్కువ ధరకే అందిస్తోంది. 

ఇక రూ.98 ప్లాన్ లో కేవలం డేటా మాత్రమే అందిస్తోంది. 26 రోజుల కాల వ్యవధి గల ఈ ప్లాన్ లో రోజుకు 1.5 డేటా చొప్పున మొత్తం 39 జిబి డేటా లభిస్తుంది. అంటే 1జిబి డేటా ఖరీదు రూ.2.51 మాత్రమేనన్న మాట. కానీ జియో 4జి స్పీడుతో డేటాను అందిస్తుండగా బి.ఎస్.ఎన్.ఎల్. 3జి స్పీడుతో అందిస్తోంది. 

Related Post