జియోలో యాడ్-ఆన్ ప్యాక్స్

May 12, 2018
img

జియో పోస్ట్ పెయిడ్ లేదా ప్రీపెయిడ్ ప్లాన్లను వినియోగిస్తున్న వినియోగదారుల కోసం జియో యాడ్-ఆన్ ప్యాక్స్ తెచ్చింది. ఒకవేళ మన రోజువారీ లేదా నెలవారీ డాటా పరిమితి అయిపోతే చింతించనక్కరలేదు. జియోలో ఇప్పుడు రూ.11, రూ.21, రూ.51, రూ.101 విలువగల యాడ్-ఆన్ ప్యాక్స్ లభిస్తున్నాయి. మన అవసరాన్ని బట్టి వాటిలో ఏదో ఒకదానిని తీసుకొన్నట్లయితే, తిరిగి అవసరమైన డాటా పొందవచ్చు. ఈ యాడ్-ఆన్ ప్యాక్స్  ప్రత్యేకత ఏమిటంటే, వీటికి నిర్దిష్ట కాలపరిమితి విదించలేదు. మనం తీసుకొన్న ప్లాన్ గడువు ఎంత కాలం వరకు ఉంటే అంతవరకు వీటిని ఉపయోగించుకోవచ్చు. అవి కూడా ఖర్చైపోతే మళ్ళీ మరో యాడ్-ఆన్ ప్యాక్స్ కొనుగోలు చేసుకోవచ్చు. జియోలో డాటా ఎక్కువగా ఉపయోగించేవారికి ఈ యాడ్-ఆన్ ప్యాక్స్ చాలా ఉపయోగంగా ఉంటాయి.  


Related Post