హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ సంస్థ

February 20, 2018
img

హైదరాబాద్ కు మరో ప్రపంచ ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ అడోబ్ రాబోతోంది. హైదరాబాద్ హెచ్.ఐ.సి.సి.లో నిన్నటి నుంచి ప్రారంభం అయిన ప్రపంచ ఐటి కాంగ్రెస్ సదస్సులో ఆ సంస్థ చైర్మన్, సిఈఓ శంతను నారాయణ్ తో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి కేటిఆర్ సమావేశమయ్యారు. ఆయనకు రాష్ట్రంలో ఐటి రంగంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించి రాష్ట్రంలో అడోబ్ సంస్థను ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. కేటిఆర్ అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించిన శంతను నారాయణ్ నిన్న సదస్సులోనే హైదరాబాద్ లో తమ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘కృత్రిమ మేదస్సు’ టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, “మంత్రి కేటిఆర్ గారు 2015లో అమెరికా వచ్చినప్పుడే నన్ను కలిసి హైదరాబాద్ లో మా సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు. గత మూడున్నరేళ్ళలో హైదరాబాద్ లో ఐటి రంగం చాలా అభివృద్ధి సాధించింది. కనుక హైదరాబాద్ లో మా సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. త్వరలోనే ఇక్కడ పెట్టబోయే మా సంస్థకు సంబంధించి పెట్టుబడి, ఉద్యోగాల కల్పన తదితర వివరాలను తెలియజేస్తాము. తెలంగాణాలో ఐటి రంగం మరింత అభివృద్ధి చెందడానికి అన్ని విదాల సహాయ సహకారాలు అందజేస్తాము,” అని అన్నారు. 

Related Post