ఎఫ్-2 టీజర్.. వెంకీ, వరుణ్ సందడి..!

December 12, 2018


img

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. అనీల్ రావిపుడి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ చేశారు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మిక్స్ చేసి ప్రేక్షకులకు కామెడీ పంచేందుకు వెంకీ, వరుణ్ లు సిద్ధమయ్యారు.

టీజర్ చూస్తే సినిమా ఆద్యంతం కడుపుబ్బా నవ్వించేలా కనిపిస్తుంది. వెంకటేష్, వరుణ్ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలకు తగినట్టుగా వచ్చిన ఈ టీజర్ అదిరిపోయింది. సినిమా సంక్రాంతికి వస్తుండగా ఈ సంక్రాంతి అళ్లుళ్ల హంగామా అదరగొట్టేలా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. పోటీలో పెద్ద సినిమాలు ఉన్నా దిల్ రాజు డేర్ గా పొంగల్ వార్ లో ఎందుకు రెడీ అంటున్నాడో ఈ టీజర్ చూశాక చెప్పొచ్చు.





Related Post

సినిమా స‌మీక్ష