మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘రాజాసాబ్’ టీజర్ ఎంతగా వైరల్ అవుతోందో, ఈ సినిమా కోసం వేసిన భూత్ బంగ్లా సెట్ కూడా అంతే వైరల్ అవుతోంది.
“ఈ ఇల్లు నా దేహం.. ఈ సంపద నా ప్రయాణం.. నా తదనంతరం కూడా నేనే అనుభవిస్తాను..’ సంజయ్ దత్ వాయిస్ ఓవర్‌తో వచ్చిన టీజర్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు.
దర్శకుడు మారుతి చాలా తెలివిగా జాతీయ మీడియాని కూడా ఆహ్వానించి ఈ సినిమా సెట్ దగ్గరుండి చూపించి, తన రాజాసాబ్‌కు ఉచితంగా పబ్లిసిటీ సంపాదించిపెట్టారు.
ఆ సెట్ చూసేందుకు వచ్చిన జర్నలిస్టులు దాని ఫోటోలు, వీడియోలు తమ మీడియాలో, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో ‘రాజాసాబ్’ పేరు దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా మారుమ్రోగిపోతోంది.
టీజర్, మారుతి ఈ ఐడియాతో ‘రాజాసాబ్’పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే ఇంత హైప్ క్రియేట్ చేసి సినిమాని మరో ఆరు నెలల తర్వాత డిసెంబర్ 5న విడుదల చేస్తుండటం వలన ఇదంతా వృధా అయిపోయినట్లే భావించవచ్చు.
ఈ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాజాసాబ్ భూత్ బంగ్లా సెట్‌ని యూట్యూబ్‌లో పెట్టింది. కనుక ప్రపంచవ్యాప్తంగా రాజాసాబ్ దానిని అభిమానులు చూడవచ్చు.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, జారీనా వాహేబ్, సంజయ్ దత్, రిద్ధి కుమార్, మురళీశర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, యోగి బాబు, వరలక్ష్మి శరత్ కుమార్, జిషు సేన్ గుప్తా ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.