గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 111వ సినిమాకి గత నవంబర్ నెలలోనే పూజా కార్యక్రమం జరిగింది. చారిత్రిక నేపధ్యంతో తీయబోతున్న ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా నయనతార నటించబోతున్నారు. త్వరలోనే రామానాయుడు స్టూడియోలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.
ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడు. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించనున్నారు.