చిరంజీవి 158వ సినిమా అయన వీరాభిమాన దర్శకుడు బాబీ కొల్లితో చేయబోతున్న సంగతి తెలిసిందే. మల్లాది వశిష్టతో ‘విశ్వంభర’ ఎప్పుడో పూర్తి చేశారు. మన శంకర్ వరప్రసాద్ సంక్రాంతికి విడుదలై హిట్ కొట్టారు. ప్రస్తుతం చిరంజీవి ఖాళీగా ఉన్నారు. కనుక వీలైనంత త్వరగా బాబీతో సినిమా మొదలుపెట్టాలనుకుంటున్నారు.
ప్రస్తుతం బాబీ టీమ్ దుబాయ్‌లో స్టోరీ డిస్కషన్ చేస్తోంది. ఇటీవలే చిరంజీవి కూడా దుబాయ్ వెళ్ళి కధ గురించి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఫిభ్రవరి నెలాఖరులోగా కధ, ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి మార్చి నుంచి షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాబీ కొల్లి కూడా అనిల్ రావిపూడిలాగే చాలా త్వరగా షూటింగ్ పూర్తిచేసి చెప్పిన సమయానికి సినిమా రిలీజ్ చేస్తారు. కనుక మార్చిలో మొదలుపెడితే ఈ ఏడాది దసరా, దీపావళికి సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈలోగా ఈ వేసవిలో విశ్వంభర విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ, లోహిత్ కలిసి నిర్మించబోతున్నారు.