భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ ‘స్వయంభూ’ మొదలుపెట్టి చాలా కాలమే అయ్యింది. ఈ ఫిబ్రవరి 13న సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సీజీ వర్క్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటంతో ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా పడినట్లు తెలుస్తోంది. కానీ ఈ వార్తని స్వయంభూ టీం ద్రువీకరించాల్సి ఉంది.
ఈ సోషియో ఫాంటసీ సినిమాలో నిఖిల్ ఓ యోధుడుగా నటిస్తుంటే, అతనికి హీరోయిన్లుగా నభా నటేష్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. వారిద్దరూ కూడా పోరాటా యోధురాళ్ళుగానే నటిస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్ పరమహంస, డైలాగ్స్: వాసుదేవ్ మున్నెప్పగారి చేస్తున్నారు.
టాగూర్ మధు, భువన్, శ్రీకర్ కలిసి పిక్సల్ స్టూడియోస్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న స్వయంభూ విదేశీ హక్కులను ఫరాస్ ఫిల్మ్ సంస్థ రూ.7 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు సమాచారం.