నారా రోహిత్, శ్రీదేవి జంటగా చేసిన ‘సుందరకాండ’ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఇప్పుడీ సినిమా ఈ నెల 23 నుంచి జియో హాట్ స్టార్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది. ఈ విషయం జియో హాట్ స్టార్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తీసిన ఈ సినిమాలో విజయ్ కుమార్, వృతి వాఘానీ, నరేష్, వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమతం, విశ్వంత్, రూప లక్ష్మి, సునయన, రఘు బాబు, అమృతం వాసు, అధుర్స్ రఘు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం: వెంకటేశ్ నిమ్మలపూడి, సంగీతం: లియోన్ జేమ్స్, కోరియోగ్రఫీ: విశ్వ రఘు, కెమెరా : ప్రభీష్ ఎం వర్మ, యశ్, ఆర్ట్: రాజేష్ పెంటకోట, స్టంట్స్: పృథ్వీ మాస్టర్, ఎడిటింగ్: రోహాన్ చిల్లలే చేశారు.
సందీప్ పిక్చర్ ప్యాలస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహాంకాళి కలిసి నిర్మించారు.
క్లుప్తంగా కధమిటంటే, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సిద్ధార్థ్ (నారా రోహిత్) తాను కోరుకున్న లక్షణాలున్న అమ్మాయి కోసం పెళ్ళి సంబంధాలు తిరస్కరిస్తుంటాడు. ఓసారి విదేశానికి బయలుదేరబోతుంటే విమానాశ్రయంలో ఐరా (వృతి) కనిపిస్తుంది.
ఆమెలో తనకు నచ్చిన లక్షణాలున్నాయని గ్రహించిన సిద్ధార్థ్ ఆమెని పెళ్ళికి ఒప్పిస్తాడు. తర్వాత ఆమెతో పెళ్ళి ఖాయం చేసుకునేందుకు కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని ఆమె ఇంటికి వెళతాడు. కానీ అక్కడ ఓ అనూహ్యమైన విషయం బయటపడుతుంది. అదేమిటో ఈ ప్రేమ పెళ్ళి కదేమిటో జియో హాట్ స్టార్‌లో చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.