ప్రధాని మోడీ@75... తగ్గేదేలే!

September 17, 2025
img

నేడు ప్రధాని మోడీ 74 ఏళ్ళు పూర్తిచేసుకొని 75లోకి అడుగుపెట్టారు. ఇంత వయసులో కూడా అయన యువకుడిలా చాలా చురుకుగా పనిచేస్తున్నారు. చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధాని మోడీ ఆలోచనలు, విధానాలు, నిర్ణయాలని గట్టిగా సమర్ధించేవారూ కోట్లమంది ఉన్నారు. అలాగే విమర్శించేవారు కోట్ల మంది ఉన్నారు. 

కానీ విమర్శలకు, ప్రశంశలకు అతీతంగా ప్రధాని మోడీ పని చేసుకుపోతుంటారు. ఇదే అయనని ఇతర రాజకీయ నాయకుల కంటే చాలా ఉన్నత స్థానంలో నిలబెట్టిందని చెప్పవచ్చు.  

మోడీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు ప్రధానిగా ఎన్నికయ్యి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. 

పెద్ద నోట్ల రద్దు, లాక్ డవున్, కాశ్మీర్ స్వయంప్రతి రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లు వంటి కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు అమలు చేసి విమర్శల పాలైనప్పటికీ, పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్, అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి సాహసోపేతమైన నిర్ణయాలతో దేశ ప్రజల మనసులు గెలుచుకున్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ట మరింత పెరిగింది.   

కరోనా దెబ్బకు భారత్‌ సర్వనాశనం అవుతుందని అగ్రరాజ్యాలు, ఆర్ధిక, ఆరోగ్యరంగాల మేధావులు అంచనాలు వేయగా, ఆ పెను సమస్య నుంచి భారత్‌ బయటపడటమే కాకుండా భారత్‌లో తయారు చేసిన కరోనా వాక్సిన్ ప్రపంచ దేశాలకు అందించి సాయపడ్డారు కూడా.  

మోడీ ప్రధానిగా బాధ్యలు చేపట్టిన తర్వాత నుంచే దేశవ్యాప్తంగా అనేక జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. భారతీయులు ఎవరూ ఊహించని విదంగా తొలిసారిగా బులెట్ రైలు తీసుకువస్తున్నారు. 

మోడీ హయంలో దేశ ఆర్ధిక పరిస్థితి దయనీయంగా మారిందని కాంగ్రెస్‌, మిత్రపక్షాలు వాదిస్తుంటాయి. కానీ కరోనా, ట్రంప్‌ సుంకాలు వంటి అతిపెద్ద సవాళ్ళు ఎదురైనా భారత్‌ ఆర్ధిక వ్యవస్థ చెక్కుచెదరకుండా ధృడంగా నిలబడే ఉంది కదా? 

భారత్‌ని అభివృద్ధి పధంలో నడిపిస్తూ, అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్టని ఇనుమడింపజేస్తున్న ప్రధాని మోడీకి ప్రజల తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది మై తెలంగాణ.కామ్‌.

Related Post