ఘట్టమనేని కార్తీక్- తేజ సజ్జా కాంబినేషన్‌లో ఈ నెల 12న వస్తున్న ‘మిరాయ్’ నుంచి జైత్రాయ.. అంటూ సాగే వీడియో సాంగ్ విడుదలైంది.
చంద్రబోస్ వ్రాసిన ఈ పాటని గౌర హరి స్వరపరిచి సంగీతం అందించగా శంకర్ మహదేవన్ ఆలపించారు. ఇది ఆ సినిమాలో కేవలం పాట మాత్రమే కాదు.. సినిమాలో గ్రాఫిక్స్ ఏ స్థాయిలో ఉన్నాయో కూడా చూపించింది.
సూపర్ హిట్ మూవీ హనుమాన్ తర్వాత తేజా సజ్జా చేస్తున్న ఈ సినిమాపై చాలా భారీ అంచనాలున్నాయి. ఈఏ సినిమాలో తేజా సజ్జ సూపర్ యోధగా నటించగా ప్రపంచాన్ని కబాళించాలనుకునే దుష్టశక్తిగా మంచు మనోజ్ నటించారు.
ఈ సినిమాలో తేజ సజ్జకు జోడీగా రీతికా నాయక్ నటించగా జగపతిబాబు, శ్రీయ శరణ్, జయరాం, రాజేంద్రనాధ్ జుట్శీ, పవన్ చోప్రా, తాంజ కెల్లర్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకి దర్శకత్వం, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గౌర హరి, ఆర్ట్: శ్రీ నాగేంద్ర తంగెల చేశారు.
సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మిరాయ్ తెలుగు, తమిళ్, కన్నడం మలయాళం, బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో 2డి, 3డి ఫార్మాట్‌లో నిర్మించి ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయబోతున్నారు.