జూన్ 14న కన్నప్ప టీజర్‌

June 08, 2024


img

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ‘కన్నప్ప’ టీజర్‌ ఈనెల 14వ తేదీన విడుదల కాబోతోంది. మంచు విష్ణు స్వయంగా ట్విట్టర్‌లో ఈవిషయం తెలియజేస్తూ ఓ పోస్టర్ కూడా పెట్టారు. దానిలో గుర్రంపై అడవిలో వేటకు వెళుతున్నట్లు చూపారు. 

స్టార్ ప్లస్ టీవీలో ప్రసారమైన మహాభారత్ హిందీ సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్‌ సింగ్‌ కన్నప్ప సినిమాకు దర్శకత్వం చేస్తున్నారు. కన్నప్పలో మంచు విష్ణుకి జోడీగా బాలీవుడ్‌ నటి నుపూర్ సనన్ నటిస్తోంది.

శివపార్వతులుగా బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వారిద్దరూ హైదరాబాద్‌ వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ నందీశ్వరుడుగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, మోహన్ లాల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

కన్నప్ప సినిమాకు మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సీ: సంగీతం, షెల్డన్ షావ్: కెమెరా, చిన్న ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.  

ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష