కల్కి ఏడి-2898 ట్రైలర్ విడుదల ఎప్పుడంటే...

June 06, 2024


img

ప్రభాస్‌ హీరోగా వస్తున్న కల్కి ఏడి-2898 సినిమాకి సంబందించి ప్రతీ ప్రమోషన్ కూడా ఆ సినిమాపై అంచనాలు ఇంకా ఇంకా పెరిగేలా చేస్తున్నాయి. ఇటీవల బుజ్జీ వెహికల్‌తో చేసిన హడావుడి మరవక మునుపే బుజ్జీ అండ్ భైరవ్ పేరుతో అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో విడుదల చేసిన యానిమేషన్ మూవీ ఇంకా ఆకట్టుకుంది. ఈ యానిమేషన్ చిత్రాలతో బాలీవుడ్‌కి కూడా తెలుగు సినీ పరిశ్రమ కొత్త పాఠాలు నేర్పిస్తోంది. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి చేర్చుతోంది. 

కల్కి ఎడి2898 ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేసే సమయం ఆసన్నమైందని వైజయంతీ మూవీస్ నిర్ణయించింది. ఈ నెల 10న కల్కి ఎడి2898 ట్రైలర్‌ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. 

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా వస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే, దిశా పటానీ వంటి అగ్రనటీనటులు నటిస్తుండటంతో యావత్ దేశ ప్రజలు కల్కి ఏడి 2898 సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

రూ.600 కోట్ల బారీ బడ్జెట్‌తో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా,  సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్‌డ్జీ స్టోజిల్‌జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందించారు.


Related Post

సినిమా స‌మీక్ష