నితిన్ రాబిన్‌హుడ్ రిలీజ్ డేట్ ఫిక్స్

April 18, 2024


img

నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న ‘రాబిన్‌హుడ్’ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్‌ 20వ తేదీన రాబిన్‌హుడ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ రిలీజ్ పోస్టర్ కూడా విడుదల చేసింది. 

జనవరిలో ఈ సినిమా టైటిల్‌ గ్లిమ్స్‌లోనే ఈ సినిమా కధ ఏమిటో దర్శకుడు చెప్పేశారు. “దేశమంత కుటుంబం నాది. ఆస్తులున్నోళ్ళు అందరూ నా అన్నదమ్ములు... ఆభరణాలు వేసుకున్నవారందరూ నా అక్కచెల్లెళ్ళు. అవసరమని వారి జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నామీద కేసులు పెడుతున్నారు. అయినా నేను హర్ట్ అవలేదు. ఎందుకంటే అయినవాళ్ళ దగ్గర తీసుకోవడం నా హక్కు. మై బేసిక్ రైట్. బికాజ్ ఇండియా ఈజ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్‌ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్...” అంటూ నితిన్ వాయిస్ ఓవర్‌తో చెప్పిన డైలాగ్స్ చాలా ఆకట్టుకున్నాయి. రిలీజ్ పోస్టరులో కూడా నితిన్ బైక్ నేమ్ ప్లేట్ మీద ‘ఆల్ ఇండియన్స్ ఆర్‌ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ అని వ్రాసి ఉంది. 

ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా రాశీ ఖన్నా నటించబోతున్నట్లు తెలుస్తోంది. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.   

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి రామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష